Monday, January 20, 2025

దక్షిణాదిలో ప్రధాని ఆధ్యాత్మిక యాత్ర ముగింపు

- Advertisement -
- Advertisement -

చివరగా ధనుష్కోడి రామాలయంలో మోడీ ప్రార్థనలు

రామేశ్వరం (తమిళనాడు) : దక్షిణాదిలో రామాయణంతో అనుబంధం ఉన్న ఆలయాల్లో తన ఆధ్మాత్మిక యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ముగించారు. రామేశ్వరం సమీపంలోని అరిచల్ మునై దగ్గర గల శ్రీరామ్ మందిర్‌లో మోడీ అర్చనలు జరిపిరు. అక్కడ ఆయన సముద్ర ఒడ్డున పుష్పాంజలి ఘటించారు. సోమవారం (22న) అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం సందర్భంగా ఆలయాలకు తన పర్యటనలకు ముగింపు సూచకంగా మోడీ ఆదివారం ధనుష్కోడి, అరిచల్ మునై మార్గంలో గల శ్రీకోదండరామస్వామి ఆలయంలో పూజ చేసి, స్వామి దర్శనం చేసుకున్నారు.

అక్కడి నుంచి శ్రీలంక కూతవేటు దూరంలో ఉంటుంది. ప్రధాని మోడీ అరిచల్ మునై సముద్ర తీరంలో పూలు సమర్పించారు. ఇంకా ఆయన జాతీయ చిహ్నంతో గల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అరిచల్ మునై తమిళనాడులో రామనాథపురం జిల్లాలో రామేశ్వరం దీవి దక్షిణ కొనలో ఉంది. ప్రధాని మోడీ బీచ్ వద్ద ‘ప్రాణాయామం’ చేసి, సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. ఆయన ఈ వారం మొదట్లో ఆంధ్ర ప్రదేశ్, కేరళలలో రామాయణంతో అనుబంధం గల ఆలయాల్లో అర్చనలు నిర్వహించారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోడీ ఆదివారం అరిచల్ మునైకి కారులో వెళ్లారు. రామ్ సేతు నిర్మాణం జరిగింది ఆ ప్రదేశంలోనే. శ్రీకోదండరామస్వామి ఆలయం సందర్శన అనంతరం ప్రధాని మోడీ మదురై చేరుకుని న్యూఢిల్లీకి విమానం ఎక్కారు. మోడీ తన వెంట తమిళనాడు నుంచి పవిత్ర జలాలతో ‘కలశాన్ని’ తీసుకువెళ్లారని ఆఅయ అర్చకులు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News