Sunday, January 19, 2025

సూర్యునికి ప్రధాని మోడీ అర్ఘ్యం

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ తన ధ్యాన ప్రక్రియలో భాగంగా వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద శుక్రవారం సూర్యోదయం సమయంలో ‘సూర్యునికి అర్ఘం’ ఇచ్చారు. ప్రత్యక్ష దైవమైన సూర్యునికి అర్చనల్లో భాగంగా ‘సూర్యునికి అర్ఘం’ ఇచ్చి, ముకుళిత హస్తాలతో ప్రార్థన చేశారు. ‘సూర్యోదయం, సూర్యునికి అర్ఘం, ఆధ్యాత్మికత’ పేరిట బిజెపి తన ‘ఎక్స్’ వేదికలో పోస్ట్ చేసిన సంక్షిప్త వీడియో క్లిప్‌లో ప్రధాని సూర్యునికి అర్ఘం విడవడం, జపమాలతో ప్రార్థన చేయడం కనిపించింది.

కాషాయ చొక్కా, శాలువా, ధోవతి ధరించిన ప్రధాని మోడీ ధ్యాన మండపంలో ధ్యానంలో నిమగ్నమైన ఫోటోలను కూడా బిజెపి పోస్ట్ చేసింది. ఆయన జపమాలతో మండపంలో ప్రదక్షిణం కూడా చేశారు. సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలకు కన్యాకుమారి పెట్టింది పేరు. రాక్ మెమోరియల్ కన్యాకుమారి సముద్ర తీరంలో ఒక చిన్న గుట్టపై ఉంది. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం సాయంత్రం ధ్యానాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ శనివారం సాయంత్రం దానిని ముగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News