- Advertisement -
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ,తమిళనాడు,పశ్చిమబెంగాల్, రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోను తొలగించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీనికోసం కొవిన్ ప్లాట్‌ఫారంలో ఫిల్టర్లు వినియోగిస్తోంది. వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫోటో ఉండడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పు పట్టింది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ దీనిపై స్పందిస్తూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోటోలు తొలగించాలని, ఇతర రాష్ట్రాల్లో ఈ ఫోటోను వాడుకోవచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు సూచించింది. ఎన్నికల కోడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
- Advertisement -