వాషింగ్టన్ డిసి: పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా వెల్లడయింది. మొత్తం 22 దేశాలకు చెందిన ప్రజల నుంచి సర్వేలో అభిప్రాయాలు సేకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మందికి మోడీకి ఓటేశారు.
మోడీ తర్వాత స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్, స్విస్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ ఉన్నారు. 2023 జనవరి 26 నుంచి 31 వరకు నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రతి దేశం నుంచి వయోజనులు వారం రోజుల్లో ఇచ్చిన రేటింగ్ సగటు ఫలితాలు ఇవని ‘మార్నింగ్ కన్సల్ట్’ పేర్కొంది. అయితే ఈ సర్వే ఏ పద్ధతిలో నిర్వహించారో చెప్పలేదు. కాగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు 30 శాతం మేరకే ప్రజాదరణ ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది.
Global Leader Approval: *Among all adults
Modi: 78%
López Obrador: 68%
Albanese: 58%
Meloni: 52%
Lula da Silva: 50%
Biden: 40%
Trudeau: 40%
Sánchez: 36%
Scholz: 32%
Sunak: 30%
Macron: 29%
Yoon: 23%
Kishida: 21%
*Updated 01/31/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/rxahbUCB0x— Morning Consult (@MorningConsult) February 2, 2023