Thursday, January 23, 2025

మోడీపై పోస్టర్ల వార్

- Advertisement -
- Advertisement -

‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు’గా ప్ర ధాని మోడీకి వ్యతిరేకంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలిసిన పోస్టర్లు జాతీయస్థాయిలో వైరల్ అ య్యాయి. ‘మోడీ దేశ్ అనే ని నాదాలతో న్యూఢిల్లీలో వేల సంఖ్యలో వెలిసిన పో స్టర్లలో 2వేల పోస్టర్లను ఢిల్లీ పోలీసులు తొలగించా రు. సుమారు 100మందిపై కేసులు పెట్టారు. ఆ రుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా అంతర్జాతీయ మీడియాల్లో ఈ వార్త వైరల్ అయింది. ఇక సోష ల్ మీడియాలో కో హటావో దేశ్ కి బచావో’ నినాదాల పోస్టర్లు హోరెత్తాయి. ఈ పోస్టర్ల వ్యవహారం అధికార వర్గాల్లోనే కాకుండా నిపుణులు, సీనియర్ పాత్రికేయుల్లో హాట్ టాపిక్‌గా మారిం ది.

ఇలాంటి పోస్టర్లు వెలువడటానికి దారితీసిన పరిణామాలపై ఎవ్వరికి తోచినట్లుగా వారు విశ్లేషించుకొంటున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ చేపట్టిన అనేక సంస్కరణలు, పన్నుల విధానం, ధరలు పెరిగిన వైనం, దేశ ప్రజల జీవన ప్రమాణాలు దుర్భరంగా మారిపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం, చివరకు ఎల్‌ఐసి వంటి ఇన్సూరెన్స్ సంస్థలను నీరుగార్చడం, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేయడం, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లేటట్లుగా చేయడం, వేల కోట్ల రూపాయలతో బ్యాంకులను మోసిగించిన వారికి బిజెపి ప్రభుత్వం అందలం ఎక్కించడం, ప్రజలు ఆరుగాలం కష్టపడి సంపాదించుకొని బ్యాంకుల్లో దాచుకొన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన వడ్డీలు తగ్గించి ప్రజల కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకొందనే విమర్శలు వెల్లువెత్తడం, పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోవడం,

గౌతమ్ అదానీ కోసం ఓడరేవులు, బొగ్గు గనులు, విమానాశ్రయాలను దారాదత్తం చేయడం వంటి అనేక అంశాలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆర్ధికవేత్తలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రభుత్వరంగ సంస్థల సీనియర్ అధికారులు, కొందరు సీనియర్ బ్యూరోక్రాట్లు మండిపడుతున్నారు. ఇలా బిజెపి ప్రభుత్వం చేసిన తప్పులను విశ్లేషించుకొంటూపోతే వందకు పైగానే తప్పుడు పనులు ఉంటాయని, మహా భారతంలో శిశుపాలుడు చేసిన తప్పుల కంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన తప్పులు అంతకంటే ఎక్కువే ఉన్నాయని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కొందరు సీనియర్ అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే దేశ రాజధానిలోనే పోస్టర్లు వెలిశాయని, దేశ రాజధానిలో ఒక ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా ఇలాంటి పోస్టర్లు వెలువడటం ఇదే మొదటిసారని అంటున్నారు.

ఇప్పటి వరకూ ఎలాంటి పోస్టర్లు వెలిసినా అవి కేవలం కొన్ని కొన్ని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఇష్యూ బేస్డ్‌గా ఉండేవని, కానీ ఇప్పటి వరకూ ఒక ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కో హటావో (మోడిని తొలగించండి), దేశ్ కి బచావో (దేశాన్ని రక్షించండి) అనే నినాదాలతో పోస్టర్లు వెలువడటం ముమ్మాటికీ ఒక సంచలనమేనని అంటున్నారు. వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిన వారిలో 95 శాతం మంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారేనని, వారంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి సన్నిహితులు, స్నేహితులేనని, అందుకే వారిని ప్రధాని రక్షిస్తున్నట్లుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు సైతం ట్వీట్ చేశారని వారు గుర్తు చేశారు. 2018లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.41 శాతం ఉండగా అది కాస్తా 2022వ సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 6.75 శాతానికి పెరిగిందని వివరించారు.

దేశ ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయిందని, పెరిగిన పన్నులు, ధరలతో జనం అంతులేని బాధలను అనుభవిస్తున్నారని వివరించారు. పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి, సామాన్య ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆర్ధిక నిపుణులు వెల్లడించారు. ఎగువ మధ్యతరగతి, లక్షాధికారులే కాకుండా చివరకు బిలియనీర్లు (కోటీశ్వరులు) కూడా దేశంలో బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని, అందుకే దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని సుమారు 2.80 లక్షల మంది కోటీశ్వరులు దేశంవదిలి ఇతర దేశాలకు పారిపోయారని, ఈ ఒక్క ఉదాహరణే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పాలన ఎంతటి ఘోరంగా ఉందో స్పష్టంచేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ అప్పులు 155.8 లక్షల కోట్లకు (జిడిపిలో 57.3 శాతం) పెరిగాయని, విదేశీ అప్పులు కూడా 7.03 లక్షల కోట్లకు (జిడిపిలో 2.6 శాతం) పెరిగాయని,

కానీ ఈ డబ్బు అంతా ఎటుపోతోందో తెలియడం లేదు కానీ ప్రజల దారిద్య్రం మాత్రం రెట్టింపయ్యిందని, ఇవెక్కడి ఆర్ధిక విధానాలో, ఇంత లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు చాలవన్నట్లుగా జిఎస్‌టితోపాటుగా మొత్తం ఏడురకాల పన్నుల రూపంలో ఖజానాకు ప్రతి ఏటా రాబట్టుకొంటున్న సుమారు 27 లక్షల కోట్ల రూపాయల నిధులు ఏమౌతున్నాయో అర్ధంకావడంలేదని, అందుకే ఈ మొత్తం ఘోరాలను చూసి తట్టుకోలేక, బాధలు, దారిద్య్రాన్ని భరించలేక కడుపుమండిన యువకులు, విద్యార్ధి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై “మోడీ కో హటావో, దేశ్ కి బచావో” అనే నినాదాలతో న్యూఢిల్లీలోనే పోస్టర్లను అంటించి ఉంటారని వివరించారు. దేశ రాజధానిలో మొదలైన బిజెపి ప్రభుత్వ వ్యతిరేకత దేశంలోని

ఇతర ప్రాంతాలకు తప్పకుండా విస్తరిస్తుందని, ఈ వ్యతిరేకత ఇంతటితో ఆగదని, ఇది ఆరంభం మాత్రమేనని, అంతం కాదని ఆర్ధిక నిపుణులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొందరు సీనియర్ అధికారులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి దేశాన్ని రక్షించండి అనే నినాదం ఇంకెంత దూరం వెళుతుందో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News