Monday, December 23, 2024

టీమిండియాపై మోదీ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజీలాండ్ ను మట్టికరిపించి, ఫైనల్ కు చేరిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రికెట్ అభిమాని అయిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారత ఆటగాళ్లను అభినందించారు. ‘టీమిండియా అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఫైనల్లోకి అడుగుపెట్టింది. చక్కటి బ్యాటింగ్, మంచి బౌలింగ్ తో టీమిండియా గెలుపు సాధించింది. ఆటగాళ్లకు నా అభినందనలు’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఇదే మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన మహమ్మద్ షమీని కూడా ప్రధాని అభినందించారు. షమీ బ్రహ్మాండంగా ఆడాడనీ, ఈ విజయం క్రికెట్ అభిమానులకు కొన్ని తరాలపాటు గుర్తుండిపోతుందని మోదీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News