న్యూఢిల్లీ: మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్రలో ఆయన నటనకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సినిమాను ప్రశంసించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన అఖిల భారతీయ మరాఠి సమ్మేళన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మహారాష్ట్ర, ముంబై వాసులు మరాఠా సినిమాలనే కాదు.. పూర్తి హిందీ సినిమా స్థాయిని పెంచారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛావా ప్రభంజనం నడుస్తోంది’ అని ప్రధాని అన్నారు. అంతేకాక.. శివాజీ సావంత్ అనే నవల తనని శంభాజీ మహరాజ్‌ను తనకు పరిచయం చేసిందని మోదీ ప్రేర్కొన్నారు.
ప్రధాని మోదీ మాటలు విన్న హీరో విక్కీ కౌశల్ ఆనందంలో మునిగిపోయాడు. ‘ఇది నాకు ఎంతో గౌరవన్ని అందించింది. మీరు చెప్పిన మాటలకు చాలా ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక లక్ష్మణ్ ఉట్కేకర్ ఛావా సినిమాకు దర్శకత్వం వహించగా.. రష్మక మందన్న హీరోయిన్‌గా నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది