Monday, December 23, 2024

దార్శనికుడు ఘననీయుడు పివి:మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని పివి నరసింహారావు దార్శనికుడైన నాయకుడని, ఆయన నాయకత్వం, మార్గదర్శకత్వం కొనియాడదగినదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. బుధవారం పివి జయంతి నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన గుణగణాలను ప్రస్తుతించారు. దూరదృష్టి ఆయన సొంతం, నింపాదిగా ఉంటూ సర్వకాల సర్వావస్థలకు ఉపయోగపడే విధానాల రూపకల్పనలో దిట్ట. ఆయన నాయకత్వం గణనీయం అని ప్రధాని తెలిపారు.

భారతదేశ ప్రగతికి ఆయన అంకిత భావం చిరస్మరణీయం అవుతుందన్నారు. జయంతి దశలో పివిజీని ఆయన గొప్పతనం నేపథ్యంలో ప్రస్తావించుకోవడం జరుగుతోందని, ప్రత్యేకించి దేశం కోసం ఆయన అంకితభావంతో పాటుపడ్డ వ్యక్తిగా అందరిలో నిలిచి ఉంటారని తెలిపారు. దేశ ప్రగతి సాధనలో ఆయన అమూల్య సేవలను గౌరవించుకోవల్సి ఉంటుందన్నారు.

దేశానికి మార్గదర్శి ః కాంగ్రెస్
మాజీ ప్రధాని పివి విశిష్ట మేధావి, ఆయన మార్గదర్శకత్వంలో దేశానికి సరికొత్త మార్గదర్శకత్వం దక్కిందని కాంగ్రెస్ పార్టీ ప్రకటన వెలువరించింది. వినూత్న భారతం దిశలో ఆయన చేపట్టిన పనులు అందరికీ ఆదర్శప్రాయం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది. భారతీయ ఆర్థిక వ్యవస్థను ఆయన కొత్త మలుపు తిప్పారు.

చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలు నయాభారత్ వైపు పరుగులు తీయించాయని తెలిపారు. ఆయన జయంతి దశలో పార్టీ అంతా కూడా ప్రజల తరఫున సంస్మరించుకొంటోందని , ఆయనకు ప్రగాఢ నివాళులు అర్పిస్తోందని తెలిపారు. ఇంటా బయటా ఆయన దేశానికి విశిష్ట ఖ్యాతిని తెచ్చిపెట్టారని, అజాతశత్రువుగా ఎదిగారని ప్రశంసించారు, ఆర్థి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News