Monday, December 23, 2024

గీతా ప్రెస్ ఓ ఆలయమే : పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్ : గీతా ప్రెస్ ఆలయానికి తీసిపోదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న విశిష్ట ప్రచురణాలయం గీతాప్రెస్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ శుక్రవారం హాజరయ్యారు. ఈ ప్రచురణాలయం ఆలయమే , ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఒక్కోసారి సాధువులు , పండితులు ప్రజలకు మార్గం చూపుతారు, కొన్ని దశల్లో గీతాప్రెస్ వంటి సంస్థలు ఆదర్శంగా ఉంటాయన్నారు.

హిందూ మతపరమైన కోణంలోనే గీతా ప్రెస్‌కు కేంద్రం గాంధీ శాంతి పురస్కారం ప్రకటించిందని కాంగ్రెస్ చేసిన విమర్శలను మోడీ ప్రస్తావించారు. ఈ సంస్థ మానవతకు మార్గదర్శి అయిందని , సేవనే మార్గం చేసుకుని సంక్షేమానికి వికాసానికి పాటుపడుతోందని తెలిపారు. ఈ క్రమంలో ఈ ప్రెస్ కేవలం ముద్రాలయం కాదు ఆలయమే అన్నారు. ఈ ప్రెస్‌తో గాంధీజికి అవినాభావ సంబంధం ఉందని, ఇక్కడి నుంచే ఆయన మాసపత్రిక కళ్యాన్ వెలువడిందని గుర్తు చేశారు. ఇప్పటికీ ఈ పత్రిక గాంధీజీ ఆలోచలనకు అనుగుణంగా ప్రకటనలకు అతీతంగా సాగుతోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News