Tuesday, January 21, 2025

ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యువజనులు, పేదలు, మహిళలు, రైతులతో కూడిన ప్రగతిదాయక భారత్‌కు చెందిన నాలుగు స్తంభాలను పటిష్టపరిచే విధంగా తాత్కాలిక బడ్జెట్ ఉందని టెలవిజన్‌లో మాట్లాడుతూ ప్రధాని తెలిపారు. ఆర్థిక లోటును కట్టడిలో ఉంచుతూనే మొత్తం వ్యయం బడ్జెట్‌లో రూ. 11,11,111 కోట్లకు పెరగడం చారిత్రకమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థికవేత్తల పరిభాషలో ఇది ఒక శుభ సంకేతమని ఆయన అన్నారు.

భాతరదేశంలోని కోట్లాది మంది యువజనులకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు 21వ శతాబ్దానికి చెందిన అధునిక మౌలిక సదుపాయాలను సృష్టించగలదని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్ కొనసాగింపు విశ్వాసాన్ని కల్పిస్తోందని, ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్ కాదని సమ్మిళిత, వినూత్న బడ్జెట్ అని ప్రధాని ప్రశంసించారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే ఈ బడ్జెట్ యువజనులకు ఉపాధి అవకాశాలు సృష్టించగలదని ఆయన అన్నారు. తన ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుందని, దాన్ని సాధించిన తర్వాత మరింత పెద్ద లక్ష్యాన్ని తనకు తానుగా నిర్దేశించుకుంటుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News