Tuesday, April 8, 2025

భారత నారీ శక్తి ప్రతీక ఆరుగురు మహిళలు

- Advertisement -
- Advertisement -

వివిధ రంగాల్లో విజయపరంపర సాగిస్తూ భారత నారీ శక్తి కి ప్రతీకలుగా నిలిచిన ఆరుగురు మహిళా మణులు ప్రధాని మోదీ సోషల్ మీడియా లో చోటు చేసుకుని ప్రశంసలు అందుకున్నారు. వారిలో చదరంగం క్రీడాకారిణి నుంచి సైన్స్, పారిశ్రామిక రంగం, మహిళా సాధికారత సాధించిన వారు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రశంసలు పొందిన వారిలో చదరంగం గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి, వ్యవసాయ పారిశ్రామికవేత్త అనితా దేవి, అణుశాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పి సోని, న్యాయవాది అంజలీ అగర్వాల్, గ్రామీణ ఎంటర్ ప్రెన్యూర్ అజితా షా ఉన్నారు. వారు సాధించిన విజయాలు, వారి వివరణలు ఆ ట్విట్టర్ లో చోటు చేసుకున్నాయి. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సోదరి అయిన వైశాలి, ఆరో ఏట నుంచి చదరంగం ఆడుతూ, పలు టోర్నమెంట్ లలో గెలుపొందారు. అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చునని, మహిళలు ఇంకా ఈ రంగంలో రాణించవచ్చునని పేర్కొంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తన విజయానికి ప్రథమ సోపానం అని పేర్కొంది.

బీహార్ కు చెందిన అనితాదేవి వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ పారిశ్రామికవేత్తగా నిలిచారు. స్వావలంబన, గ్రామీణ ధికారకత సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. మధోపూర్ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ లిమిటెడ్ స్థాపించి తన గ్రామంలోనే వంద మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మఖానా తామరగింజల ద్వారా పాప్ కార్న్ వంటి పౌష్టికాహారం ద్వారా సావలంబన సాధిస్తున్నారు. సైంటిస్ట్ లు ఎలినా మిశ్రా, శిల్పి సోని సైన్స్ రంగంలో మహిళలు పాల్గొనాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. న్యూక్లియర్, సైన్స్ టెక్నాలజీలోకి మహిళలు రావాలని కోరారు. మిశ్రా న్యూక్లియర్ సైంటిస్ట్. రిమోట్ హెల్త్ కేర్ లో మెడికల్ అప్లికేషన్స్ వంటి పలు ప్రాజెక్టులు చేపట్టారు కాగా, శిల్పీ సోనీ అంతరిక్ష పరిశోధన సైంటిస్ట్. గత 24 ఏళ్లుగా ఇస్రోలో పనిచేస్తూ అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలలో కీలక పాత్రవహించారు. న్యాయవాది అంజలీ అగర్వాల్.. ప్రతి మహిళ గౌరవంగా, స్వాతంత్రంగా తమ జీవితాలను సాగించాలని కోరారు.

వికలాంగులకు మౌలిక సదుపాయాల కల్పనకు న్యాయపరంగా కృషి చేస్తున్నారు. ఇక ఫ్రాంటియర్ మార్కెట్స్ వ్యవస్థాపకు రాలు సిఈఓ అజిత షా ఆర్థికంగా మహిళలు సావలంబన సాధించాలని కోరుతున్నారు. మేరీ సహేలీ యాప్ ద్వారా గ్రామీణ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. దేశ భవిష్యత్ తీర్చి దిద్దడంలో మహిళలు కీలక పాత్రవహించాలని సూచిస్తున్నారు. వీరు భారత నారీ శక్తికి ప్రతీకలు.. ఇటువంటి వారివల్లనే వికసిత భారత్ సాధ్యం కాగలదని ప్రధాని పేర్కొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నట్లు మోదీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News