Saturday, November 16, 2024

నేడు పాలమూరుకు ప్రధాని నరేంద్రమోడీ రాక

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోడీ రానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 గంటలకు నుంచి ప్రధాని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమంలో జక్లెర్ … కృష్ణా మధ్య కొత్త రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. దీనితో పాటు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమంలో రహదారి, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య వంటి ముఖ్యమైన రంగాలలో రూ. 13,500 కోట్ల కంటే ఎక్కువ విలువైన అనేక ఇతర అభివృద్ధ్ది ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఇటీవల కాలంలో తెలంగాణ రైలు నెట్ వర్క్ పరిధిలో వేగవంతమైన పరివర్తనకు సాక్షిగా నిలిచింది.

నూతన లైన్ల ఏర్పాటులో, ఇప్పటికే ఉన్న లైన్ల విస్తరణలో, రైలు మార్గాల విద్యుదీకరణలో, కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో, లేదా నూతన ప్రయాణ సౌకర్యాల ఏర్పాటులో రాష్ట్రం మునుపెన్నుడూ లేని అభివృద్ధిని వీక్షించింది. జక్లెర్ .. కృష్ణా మధ్య 37.48 కిలో మీటర్ల మేర నూతన రైలు మార్గం దక్షిణ మధ్య రైల్వే ద్వారా అమలు చేయబడుతున్న మహబూబ్‌నగర్ … మునీరాబాద్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. దేవరకద్ర కృష్ణా (65.825 కిమీలు) సెక్షన్ ప్రారంభంతో తెలంగాణలో ఈ ప్రాజెక్టు మొత్తం భాగాన్ని పూర్తి అవుతుంది. కృష్ణా .. జక్లేర్ మధ్య నూతన లైన్ దాదాపు రూ. 504.89 కోట్ల వ్యయంతో పూర్తయింది. ఇప్పటికే ఉన్న కృష్ణా స్టేషన్ భవనంతో పాటు జక్లేర్, మగనూరు, మక్తల్ , కుంసి హాల్ట్ అనే మరో నాలుగు కొత్త స్టేషన్ భవనాలు కూడా నిర్మించబడ్డాయి.

అందుబాటులో ఉన్న ఇతర రైలు మార్గాలతో పోలిస్తే ఈ రైల్ మార్గం కాచిగూడ, రాయచూర్ మ ధ్య అతి తక్కువ దూరం గల రైలు మార్గం. ఈ రైలు మహబూబ్‌నగర్ , నా రాయణపేట జిల్లాల్లోని ప్రజలకు రాజధాని వైపు సౌకర్యవంతమైన, చౌకైనా రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ రైలు విద్యార్థులు, రోజువారి ప్రయాణికులు, కార్మికులు మొదలైన వారికి ప్రయోజనం కలగడమే కాకుండా నారాయణపేటలోని చేనేత పరిశ్రమకు ఎంతగానో ఊతమిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News