- Advertisement -
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హకీంపేట ఎయిర్ పోర్టలకు చేసుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ ప్రత్యేక వినామనంలో హకీంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి వరంగల్ బయల్దేరి వెళ్లనున్నారు.మొదట 10.30నిమిషాలకు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
తర్వాత హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో దాదాపు 3500మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
- Advertisement -