Wednesday, January 22, 2025

తల్లిని చూసేందుకు ఆస్పత్రికి చేరుకున్న మోడీ..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన తల్లిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సెంటర్ చేరుకున్నారు. మెడీ నగరానికి చేరుకోవడానికి ముందు విమానాశ్రయంలో డ్రోన్లు, ఇతర విమానాల రాకపోకలను నిషేధిస్తూ నగర పోలీసు కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ నోటిఫికేషన్ జారీచేశారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ యుఎన్ మెహతా ఆసుపత్రిని సందర్శించడంతో క్యాబినెట్ సమావేశం వివరాలను వెల్లడించడానికి నిర్వహించాల్సిన విలేకరుల సమావేశం కూడా రద్దయింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఆసుపత్రిని సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News