Friday, December 20, 2024

ఎల్బీ స్టేడియంకు చేరుకున్న మోడీ.. పూలతో ఘన స్వాగతం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బిజెపి బిసి ఆత్మ గౌరవ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. నవంబర్ 30న రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తరుపున ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంకు వాహంనంలో వచ్చిన ప్రధాని మోడీకి బిజెపి నాయకులు, కార్యకర్తలు దారి పొడువునా పూలు జల్లుతో ఘన స్వాగతం పలికారు.

కాగా, బిజెపితో పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. బిజెపి అగ్ర నాయకులతోపాటు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. ఈ ఎన్నిక ప్రచారంలో బిజెపి.. బిసి ముఖ్యమంత్రి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News