Friday, December 20, 2024

మాస్కో ఉగ్ర దాడికి ప్రధాని మోడీ ఖండన

- Advertisement -
- Advertisement -

మాస్కోలో జరిగిన ఉగ్ర మారణ కాండను భారత్ తీవ్రంగా గర్హిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వెల్లడించారు. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు మోడీ సంఘీభావం తెలిపారు. మీడియా వార్తల ప్రకారం, దుండగులు శుక్రవారం మాస్కోలోని ఒక పెద్ద కచేరి మందిరంలోకి చొరబడి జనంపైకి కాల్పులు జరపగా 60 మందికి పైగా హతులైనట్లు, 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. దుండగులు ఆ హాలుకు నిప్పు పెట్టారు కూడా.“మాస్కోలో ఆ దారుణ ఉగ్ర మారణకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితులు కుటుంబాల పట్ల సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఈ విషాద సమయంలో రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం, ప్రజల పట్ల భారత్ సంఘీభావం వ్యక్తం చేస్తోంది’ అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News