Monday, April 21, 2025

మయన్మార్‌లో భూకంపం.. ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మయన్మార్, థాయిలాండ దేశాల్ని భారీ భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం ధాటికి భవనాలు కుప్పకూలిపోయాయి. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. అయితే ఈ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవించడం ఆందోళన కలిగించింది. ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థిస్తున్నను. ఇండియా తరఫు నుంచి అన్ని విధాలుగా ఆదుకొనేందుకు సిద్ధంగా ఉన్నాము’ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భూకంప తీవ్రతకి కుప్పకూలిన భవనాల కింద ప్రజలు చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. విపత్తు జరిగిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అయితే ఇప్పటివరకూ ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News