Sunday, January 19, 2025

నేపాల్ భూకంప ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

నేపాల్ భూకంప ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్త చేశారు. భూకంప మృతులకు ఈ సందర్భంగా మోడీ సంతాపం తెలిపారు. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూ ప్రకంపనలు సంభవించడంతో పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున్న ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనలో వందల మంది తీవ్రంగా గాయపడినట్లు.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. నేపాల్ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని.. నేపాల్ కు అన్ని రకాలుగా సాయం అందించేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. ప్రస్తుతం నేపాల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ఇళ్లు కుప్పకూలిపోవడంతో.. ఇళ్ల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News