Thursday, December 19, 2024

ప్రధాని మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

- Advertisement -
- Advertisement -

నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. రక్షణ, ఇంధన, వ్యాపార వంటి పలు కీలక రంగాలల్లో ఈ సాయం విస్తరించుకుంటుందని తెలిపారు. నైజీరియా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ ఆదివారం ఆ దేశ అధ్యక్షులు బోలా అహ్మద్ టినుబూతో సమావేశం అయ్యారు. వీరి భేటీ ఇక్కడి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం అయింది. ముందుగా మోడీనే పలు విషయాలను ప్రస్తావించారు. ప్రపంచానికి ఇప్పుడు ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, డ్రగ్స్ వంటివి కీలక సవాళ్లు అయ్యాయి. వీటిని రెండు దేశాలు కలిసి సమర్థవంతంగా కట్టుదిట్టంగా తిప్పికొట్టాల్సి ఉందని మోడీ పిలుపు నిచ్చారు. ఆదివారం తెల్లవారుజామున మోడీ ఇక్కడికి వచ్చారు. 17 సంవత్సరాల తరువాత భారత ప్రధాని ఒక్కరు ఈ దేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి అయింది. ఇప్పుడు నైజీరియా నాయకుడితో తాను జరిపిన చర్చలు పలవంతం అవుతాయని ఆశిస్తున్నట్లు ,

ఉభయ దేశాల సంబంధాల్లో ఇది నూతన అధ్యాయానికి దారితీస్తుందని భావిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. ఇక నైజీరియాలోని దాదాపు 60వేల మందితో భారతీయ సంతతి వారు ఇరుదేశాల నడుమ పటిష్ట బంధం దిశలో ప్రధాన బృందం మాదిరిగా వ్యవహరిస్తున్నారని కితాబు ఇచ్చారు. భారతీయ సంతతి వారు ఏ దేశంలో ఉన్నా భారత్‌కు గర్వకారణం అవుతున్నారనే విషయం మరోసారి తాను గుర్తించానని చెప్పారు. ఇక్కడి భారతీయుల సంక్షేమానికి అధ్యక్షులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం అభినందనీయం అన్నారు. గత నెలలో నైజీరియాలో వరదలకు దెబ్బతిన్న ప్రజలకు ఉపయోగపడేలా భారతదేశం 20 టన్నుల సహాయక సామాగ్రిని పంపిస్తుందని తెలిపారు. ప్రతినిధుల బృందాల సమావేశానికి ముందు మోడీ స్థానిక అధ్యక్ష భవనంలో టినూబుతో ముఖాముఖి సమావేశం అయ్యారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి.

ప్రధాని మోడీకి అత్యున్నత నైజర్ పురస్కారం
నైజీరియా అత్యున్నత పౌరపురస్కారం ది ఆర్డర్ ఆఫ్‌ది నైజర్ గ్రాండ్ కమాండర్‌ను ప్రదాని మోడీకి బహుకరించారు. 1969లో క్వీన్ ఎలిజబెత్‌కు ఈ అవార్డు దక్కింది. ఓ విదేశీ నేతకు ఈ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తొలుత నైజీరియాకు వచ్చారు. అబూజా నుంచి బ్రెజిల్‌లో జరిగే జి 20 సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లుతారు. తరువాత గియానాలో పర్యటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News