- Advertisement -
అరుదైన ఆతిథ్య సంకేతంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్‌థనికి స్వాగతం పలికారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనకై ఖతార్ అమీర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అమీర్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యి, ప్రధాని మోడీతో చర్చలు జరపనున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానంపై ఖతార్ అమీర్ వచ్చారు. ఖతార్ అమీర్ భారత్‌లో అధికారిక పర్యటన జరపడం ఇది రెండవ సారి. ఆయన 2015 మార్చిలో భారత్‌ను సందర్శించినట్లు విదేశాంగ శాఖ తెలియజేసింది. భారత్, ఖతార్ మధ్య మైత్రి, విశ్వాసం, పరస్పర గౌరవంతో కూడిన ప్రగాఢ, చారిత్రక సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన శక్తి, టెక్నాలజీ రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో పటిష్ఠం అవుతూ వస్తున్నాయి.
- Advertisement -