Thursday, December 19, 2024

సేంద్రీయ సాగుకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఢిల్లీ లోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మోడీ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించారు. సేంద్రియ వ్యవసాయం , చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రస్తుతం డిమాండ్ పెరిగిందని, ప్రజలు ఇటువంటి ఆహారాన్ని ఇష్ట పడుతున్నారని, వెల్లడించారు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే ) కొత్త రకాల పంటల గురించి , వాటి ప్రయోజనాల గురించి రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News