Monday, December 23, 2024

“ఉచిత హామీల సంస్కృతి” పై ప్రధాని మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

వారంటీ గడువు ముగిసిన కాంగ్రెస్ గ్యారంటీలకు అర్థం ఏముంది ?
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ గురువారం లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉదేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ బూత్ స్థాయి నుంచి ప్రచారం పటిష్టంగా సాగాలని ప్రబోధించారు. ఈ సందర్భంగా “ఉచిత హామీల సంస్కృతి” పై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ తాము అధికారం లోకి వస్తే ఉచితంగా ఎన్నో కల్పిస్తామని హామీలు ఇచ్చిందని, ఆ పార్టీకే వారంటీ గడువు ముగిసినప్పుడు ఇక గ్యారంటీలకు అర్థం ఏముందని మోడీ అపహాస్యం చేశారు. ఈ రేవిడి కల్చర్ (ఉచిత హామీల సంస్కృతి) ముగిసి పోవాలని గట్టిగా విమర్శించారు.

Also read: బిజెపి సింహం.. సింగిల్ పోటీ చేస్తోంది

ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను ఉదహరించారు. వారి ఎన్నికల హామీలు ఇప్పటికీ గ్యారంటీగానే మిగిలి పోయాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే “అవినీతి, బంధుప్రీతి గ్యారంటీ” గా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కర్ణాటకలో అన్ని ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, కుటుంబం లోని యజమానురాలికి గృహలక్ష్మి పథకం కింద నెలనెలా రూ. 2000 ఆర్థిక సాయం, డిగ్రీ చదివిని యువతకు ప్రతినెలా రూ.3000, డిప్లొమా విద్యార్థులైన 1825 ఏళ్ల వయసు యువతకు రెండేళ్ల పాటు నెలకు రూ. 1500 ఇస్తామని ఉచితహామీలు గుప్పించింది. ఉచిత హామీల కారణంగా రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని , దేశం కానీ , ప్రభుత్వాలు కానీ ఈ విధంగా పాలన సాగించలేవని వ్యాఖ్యానించారు. అధికారం కోసం,అవినీతి కోసం కొన్ని రాజకీయ పార్టీలు సామ, దాన, దండ, బేధ మార్గాలు ఉపయోగిస్తన్నాయని విమర్శించారు.

Also read: బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పోలీసుల వినతి తిరస్కారం!

ఈ పార్టీలు దేశ భవిష్యత్తు, కర్ణాటక భావి తరాల యువత, మహిళల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాలు తాత్కాలిక అవసరాల కోసం పాలన సాగించకూడదని, సంపద సృష్టికి పాటుపడాలని సూచించారు. అందువల్ల కుటుంబాలు కొన్ని దశాబ్దాల పాటు గాడిన పడతాయని పేర్కొన్నారు. బీజేపీ దగ్గరి మార్గాలు అవలంబించడం లేదని, అభివృద్ధి భారతం కోసం పనిచేస్తోందని చెప్పారు. తాత్కాలిక సవాళ్లను ఉద్దేశించి పేదలకు వీలైనంత సాయం చేయడమౌతోందని ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సినేషన్, తదితర సౌకర్యాలు కల్పించడమైందని ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News