Sunday, February 23, 2025

సుపరిపాలన, అభివృద్ధికే ప్రజలు పట్టం: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లోను ఆ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రజాతీర్పుకు శిరసువంచి నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రాష్ట్రాల ఫలితాలు సుపరిపాలన, అభివృద్ధి వైపే ప్రజలు కట్టుబడి ఉన్నట్లు సూచిస్తున్నాయన్నారు. బిజెపికి సడలని మద్దతు ఇచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పని చేయనున్నట్లు తెలిపారు. తీవ్రంగా కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కార్యకర్తలు సక్సెస్ అయ్యారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News