Tuesday, November 5, 2024

జగమంతా మోడీ కుటుంబమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం సోషల్ మీడియాలో తమ మద్దతును చాటుకున్నారు. తమ సోషల్ మలడియా ఖాతాలలో మోడీ కా పరివార్‌గా తమను తాము ప్రకటించుకున్న పార్టీ సభ్యులు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలను కూడా తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నారు. ఆదివారం పాట్నాలో జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ల్రాలూ ప్రసాద్ ప్రసంగిస్తూ ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బిజెపి సోమవారం ఎదురుదాడి ప్రారంభించిది. మోడీ అభిమానులతోపాటు పలువురు సోషల్ మీడియా యూజర్లు ప్రధాని మోడీకి మద్దతుగా తమ పేజీలలో మార్పులు చేశారు. ప్రధాని మోడీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, గత 16, 17 ఏళ్లుగా ఇటువంటి కుత్సితమైన ఆరోపణలు చేస్తున్నారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది సోమవారం నాడిక్కడ విలేకరుల సావేశంలో మండిపడ్డారు.

ఇండియా కూటమి నాయకుల సమక్షంలో ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ మరోసారి ఆదివారం ప్రధాని మోడీపై ఇటువంటి అల్పమైన వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు. ఇది చాలా బాధాకరం, విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ కుటుంబం గురించి లాలూ మాట్లాడారని, యావద్దేశం మోడీ కుటుంబమేనని లాలూకు గుర్తు చేయదలచుకున్నానని త్రివేది చెప్పారు. ప్రధాని మోడీకి మద్దతుగా పార్టీ నాయకులు ఏకం కావడం ఇది మదటిసారి కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈ రకమైన పరిణామమే చోటుచేసుకుంది. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బిజెపి నాయకులు, మోడీ అభిమానాలు మై భీ చౌకీదార్(నేను కూడా రక్షకుడిని) అంటూ సోషల్ మీడియాలో ్రఉధృతంగా ప్రచారం చేశారు. ప్రధాని మోడీ నిజాయితీ, అవినీతికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న వైఖరిని కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగిన ప్రచారం మోడీ ప్రతిష్టను పెంచడమే గాక గత ఎన్నికల్లో ఆయనను రెండవసారి అధికారంలోకి తీసుకువచ్చింది.

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఏమాత్రం పనిచేయకపోగా గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. యవద్దేశం తన కుటుంబమని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారతదేశంలోని 140 కోట్ల ప్రజలంతా తన కుటుంబమేనని పునరుద్ఘాటించడం విశేషం. మోడీ ఆ ప్రకటన చేసిన ఒద్ది సేపటికే బిజెపి నాయకులు, అభిమానులు తమ ప్రొఫైల్స్‌లో మోడీ కా పరివార్ అని చేర్చారు. నేటి బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీల వారసత్వ రాజకీయాలను కూడా మోడీ ఎండగట్టారు. వాటి ముఖాలు వేరైనప్పటికీ జుఝాట్, లూట్(అబద్ధాలు, దోపిడీ)లో అందిరీ ఒకే కరమైన స్వరూపమని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News