- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో తుపాను ప్రభావ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కోస్తా ఆంధ్ర, ఒడిషలోని కోస్తా ప్రాంతాలపై పడే అవకాశం ఉందని ప్రధానికి సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు వివరించారు. డిసెంబర్ 4న ఒడిష తీరాన్ని వాయుగుండం తాకనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒడిష ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 13 జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ప్రధానికి వారు వివరించారు.
- Advertisement -