- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమీక్ష నిర్వహించారు. కొత్త కోవిడ్ వేరియంట్ (ఒమిక్రాన్)పై అప్రమత్తంగా ఉండాలన్నారు. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ కనుగొనబడిన సంగతి తెలిసిందే. దీంతో అంర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేశారు. అయితే ఇప్పటికే కొత్త వేరియంట్ పై తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది.
- Advertisement -