- Advertisement -
న్యూఢిల్లీ : ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించిన హామీల గురించి స్వయంగా శనివారం సమీక్షించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా రుణ సదుపాయం గురించి, గృహాలకు సౌర విద్యుత్ గురించి ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా పథకాల అమలుపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. నగరాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి బ్యాంకు రుణాలు,వడ్డీలో ఉపశమనం కల్పించేందుకు గృహ రుణంపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్రం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -