న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల పరిస్థితిపై చర్చించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రధాని సూచించారు. కోవిడ్ ఔషధాల లభ్యతపై అధికారులను ఆరా తీశారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారు. లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్న 12 రాష్ట్రాల సమాచారం అందిందని, కేసుల పాజిటివిటీ 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించడానికి రాష్ట్రాలకు బృందాలను పంపినట్లు పిఎం తెలిపారు. ఆక్సిజన్ లభ్యత, బెడ్ ఆక్యుపెన్సీ మోడీ ఆరా తీశారు. కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ గురించి చర్చించిన పిఎం మోడీ, రాబోయే కొద్ది నెలల్లో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని అధికారులను మోడీ ఆదేశించారు.
PM Modi reviews state-wise Covid situation