Monday, January 20, 2025

అయోధ్యలో ప్రధాని రోడ్ షో

- Advertisement -
- Advertisement -

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30వ తేదీన అయోధ్యలో పర్యటిస్తారు. ముందుగా అక్కడ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. తరువాత రోడ్‌షోలో పాల్గొంటారు. ఆ తరువాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనవరిలో రామాలయ ప్రాణప్రతిష్ట నేపధ్యంలో విమానాశ్రయం ఏర్పాటు అయింది. ప్రధాని ఇక్కడ పునర్ నిర్మిత రైల్వే స్టేషన్‌ను కూడా ఆరంభిస్తారని అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రధాని రోడ్ షో సాగుతుంది.

ఈ నేపథ్యంలో దారికిఇరువైపులా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సాధువులు, పండితులు ప్రధానిని దీవించే కార్యక్రమం ఉంటుంది. ఈ క్రమంలో 51 చోట్ల వేదికలను ఏర్పాటు చేశారు. అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టుకు దారిగా ఉండే 5 కిలోమీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.ప్రఖ్యాత హనుమాన్ గార్హి దేవాలయం కూడా సందర్శిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News