Monday, January 20, 2025

నక్సలిజాన్ని రూపుమాపుతా:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హింసను రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఆయన వాగ్దానం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన ధంతరి జిల్లాలో మంగళవారం ఒక ప్రచార సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు, అభివృద్ధికి రెండిటికీ పొసగదని కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పతాక స్థాయికి చేరుతాయని ఆరోపించారు. శఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు హింసాత్మక కార్యకలాపాలను అదుపు చేయలేకపోయిందని, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్నన్ని రోజులు నక్సలిజం పెరుగుతూనే ఉందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్‌కు, హింసకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన ఆయన అవినీతి అంటూ తానే సమాధానమిచ్చారు.

తన అవినీతిని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ హింసను రెచ్చగొట్టేదని, ప్రజలు చస్తూ ఉంటే కాంగ్రెస్ తన కజానాను నింపుకుంటూ ఉండేదని ఆయన ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజనం వేగంగా తగ్గుతోందని, ఇక్కడి బిజెపి ప్రభుత్వం అవినీతిని, మావోయిజాన్ని అదుపులోకి తెచ్చిందని మోడీ తెలిపారు. నక్సలిజాన్ని రూపుమాపుతానని తల్లిదండ్రులకు తాను మాట ఇస్తున్నానని ఆయన చెప్పారు. తమ పిల్లల జీవితాలు వృథా కావని వారి తల్లులకు తాను హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. మీ పిల్లలను కాపాడేందుకు నక్సలిజాన్ని, మావోయిజాన్ని అంతం చేస్తానని ప్రతి తల్లికి వాగ్దానం చేస్తున్నానని ప్రధాని తెలిపారు. మహాసముంద్ నియోజకవర్గంలోని కొంత భాగంలో నక్సల్ ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 26న రెండవ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News