Saturday, January 18, 2025

మొబిలిటీ రంగంలో భారత్‌దే భవిత

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: చలనశక్తి భవిష్యత్ భారత్‌దే అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉద్ఘాటించారు. భారత్ ఏడాదిలో కనీ వినీ ఎరగని స్థాయిలో రెండున్నర కోట్ల వాహనాల విక్రయాన్ని నమోదు చేసిందని, కేవలం నాలుగు సంవత్సరాల్లో 36 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)ని ఆకర్షించిందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ను ప్రారంభించిన అనంతరం సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, చలనశక్తి రంగంలో తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఎదురుచూస్తున్న ప్రతి మదుపరికి భారత్ విశిష్ట గమ్యస్థానంగా నిలుస్తున్నదని చెప్పారు. దేశ రాజధానిలోని భారత్ మండ పం, యశోభూమిలోని మూడు వేదికలు, ఇండి యా ఎక్స్‌పో సెంటర్‌లోను, గ్రేటర్ నోయిడా మార్ట్‌లోను ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఎక్స్‌పో మోటారు వాహనాలు. విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీల వ్యాప్తంగా 100 నూతన ఆవిష్కరణలను చూడనున్నది. దేశంలోని అతిపెద్ద ఆటో ఎక్స్‌పో శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు జరగనున్నది.

ఆటోమోటివ్ పరిశ్రమ సృజనాత్మకత, టెక్నాలజీ ఆధారంగా నడుస్తున్నదని చెప్పిన మోడీ భవిష్యత్ తూర్పు దేశాలు, ఆసియా, భారత్‌లకు చెందుతుందని వక్కాణించారు. ‘భారత్‌లో తయారీ’, ‘ప్రపం చం కోసం తయారీ’ అనే మంత్రంతో ముందు కు సాగేలా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పూర్తిగా మద్దతుదారుగా, ప్రోత్సాహించేదిగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పని తీరు ఆధారిత ప్రోత్సాహకం (పిఎల్‌ఐ) పథకాలు ‘భారత్‌లో తయారీ’ ప్రచారోద్యమానికి కొత్త ఊపు ఇచ్చిందని, రూ. 2.25 లక్షల కోట్లకు పైగా విలువ చేసే అమ్మకాలకు, ఈ రంగంలో లక్షన్నర పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి దోహదం చేసి ందని ఆయన వెల్లడించారు. గడచిన సంవత్స రం భారత మోటార్ వాహనాల పరిశ్రమ సు మారు 12 శాతం మేర వృద్ధి చెందిందని, ఎగుమతులు పెరిగాయని ప్రధాని తెలియజేశారు. భారత్‌లో ఏటా అమ్ముడవుతున్న కార్ల సంఖ్య అనేక దేశాల జనాభా కంటే అధికం అని చెప్పారు. ఏడాదిలో రమారమి రెండున్నర కోట్ల కార్ల విక్రయం భారత్‌లో నిరంతరం పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని మోడీ పేర్కొన్నారు.

భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మూడవ అతిపెద్ద ప్ర యాణికుల వాహనాల మార్కెట్ అని చెప్పారు. దేశంలోని అధిక యువ జనాభా, విస్తరిస్తున్న మధ్య తరగతి, శీఘ్ర పట్టణీకరణ, ఆధునిక మౌ లిక వసతుల అభివృద్ధి, ‘భారత్‌లో తయారీ’ ప థకం ద్వారా సరసమైన ధరలకు అందుబాటు లో వాహనాలు సహా పలు అంశాలు భారత్‌లో చలనశక్తి భవితకు మూలాధారం అవుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌లో మధ్య తరగతివారే ప్రధాన వినియోగదారులుగా ఉ న్నారని, గడచిన దశాబ్దంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చి వాహనాలు కొనుగోలు చేస్తు న్న నవ మధ్య తరగతివారుగా రూపొందారని చెప్పారు. గ్రీన్ టెక్నాలజీ ఇవిలు, హైడ్రోజన్ ఇంధనం, బయోఫ్యుయెల్స్‌పై దేశం దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో విద్యుత్ వాహనాల విక్రయం 640 రెట్లు పెరిగిందని తెలియజేశారు. పది ఏళ్ల క్రితం ఏటా 2600 విద్యుత్ వాహనాలు అమ్ముడవుతుండగా, 2024లో 16.8 లక్షలకు పైగా వాహనాల విక్రయం జరిగినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News