Monday, December 23, 2024

ఛార్‌ధామ్ యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కటుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వస్తున్న ఛార్‌ధామ్ యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. వీటిని అధునాతనం చేయడం జరుగుతుంది. కేదార్‌నాథ్ బద్రీనాథ్ పునర్మిర్మాణ ప్రాజెక్టులను రూ 1300 కోట్లతో చేపట్టారు. కేదార్‌నాథ్, హేమ్‌కుంద్ సాహిబ్ రోప్‌వే పనులకు రూ 2500 కోట్లు, ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన ఆలయాల పునరుద్ధరణకు పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఇప్పటికే రిషికేష్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు కోసం రూ 16000 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ఈ ప్రాంతంలోని వివిధ స్థలాలకు ఏటేటా యాత్రికుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఓ విధంగా మంచిదే అయితే ఇదే దశలో పలు సవాళ్లు ఉండనే ఉంటాయన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితే సత్ఫలితాలు అందుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన వందేభారత్‌తో డెహ్రాడూన్ ఢిల్లీ మధ్య ప్రయాణకాలం ఇకపై నాలుగున్నర గంటలు అవుతుంది. ఇంతకు ముందు ఇది ఆరు గంటల పది నిమిషాలు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉండేది. ప్రధాని చే వందేభారత్ ప్రారంభానికి ముందు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు.

ఇక్కడి ప్రజల పట్ల ప్రధానికి ఉన్న ప్రత్యేక ప్రేమకు నిదర్శనంగానే అత్యంత అధునాతన ఏర్పాట్ల ఈ వందేభారత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ఎనిమిది కోచ్‌ల వందేభారత్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం ఎనిమిది కోచ్‌లు ఛెయిర్ కార్స్‌తో 360 డిగ్రీల తిరుగాడే సీట్లు, సిసిటీవీ కెమెరాలు, దివ్యాంగుల అనుకూల వాష్‌రూంలు, బ్రెయిలీ లిపిలో సీట్ల నెంబర్లు, ప్రతి బోగీలో ప్రయాణ సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News