చండీగఢ్: ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్‌కు పీఎం భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చన్నీ హోషియార్‌పూర్‌కు సోమవారం వెళ్లాల్సి ఉంది. కానీ మోడీ జలంధర్‌లో ఎన్నికల ర్యాలీలో పర్యటిస్తున్న సందర్భంగా చండీఘడ్‌లోని రాజేంద్ర పార్కు ఏరియాను నోఫ్లై జోన్‌గా ప్రకటించామని పీఎం భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ కారణంగా సీఎం హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు హోషియార్‌పూర్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ జఖర్ స్పందిస్తూ సీఎం హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వక పోవడం, సీఎం పర్యటనను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
PM Modi Security not allow to Punjab CM’s Helicopter