Friday, December 20, 2024

శ్రీరాముని ‘చరణామృతాన్ని’ ప్రధాని విడిగా అడిగారు

- Advertisement -
- Advertisement -

మోడీ 11 రోజుల దీక్ష విరమణపై సంత్ వివరణ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం శ్రీరాముని ‘చరణామృతాన్ని’ తనను ‘విడిగా’ అడిగారని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవిండ్ దేవ్ గిరి మహరాజ్ మంగళవారం వెల్లడించారు. అయోధ్య రామ్ మందిరంలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ అనంతరం తన 11 రోజుల అకుంఠిత నిరశన దీక్షను విరమించేందుకు ప్రధాని మోడీకి ఆయన ‘చరణామృతాన్ని’ అందజేశారు. ‘(ఆయన దీక్ష విరమణకు) మేము నీటిలో కొన్ని నిమ్మ రసం చుక్కలతో తేనె కలిపి ఆయనకు ఇవ్వవలసి ఉంది’ అని గోవింద్ మహరాజ్ ఒక వార్తా సంస్థతో చెప్పారు.

‘ఆ సమయంలోనేను ఒక తల్లిలా భావించాను. నా కుమారుని దీక్ష విరమణకు ఆయనకు అందజేస్తున్నాననే భావన నాకు కలిగింది’ అని గోవింద్ తెలిపారు. ప్రధానిని మూడు రోజుల నిరశన దీక్ష పాటించవలసిందిగా ప్రధానిని కోరినట్లు, కానీ ఆయన 11 రోజుల దీక్ష పూర్తి చేయాలని నిశ్చయించినట్లు గోవింద్ సోమవారం తన ప్రసంగంలో తెలియజేశారు. ‘రోజుకు ఒకసారి ఆహారం తీసుకోవలసిందిగా ఆయన (ప్రధాని మోడీ)ని మేము కోరాం. కానీ దీక్ష సమయంలో ఘన ఆహారం తీసుకోరాదని నిశ్చయించుకున్నారు’ అని గోవింద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News