Thursday, January 23, 2025

సెప్టెంబర్ 17న తెలంగాణకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినో త్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 17న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. గతేడాది అమిత్ షాను రప్పించి పరేడ్ మైదానంలో భారీ సభను బిజెపి ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ సారి ప్రధానమంత్రిని రప్పించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీని రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరినట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలోని ఏదో ఓ జిల్లా కేంద్రంలో సభ నిర్వహిందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఎలాగైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపి మోడీ సమావేశంతో పరిస్థితిని తమకు అనుకూలంగా చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News