- Advertisement -
హిరోషిమా: జి 7 సదస్సు నేపథ్యంలో హిరోషిమాలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్, భారత ప్రధాని మోడీ పలకరించుకుంటూ , ఓ క్షణం గాఢాలింగనం చేసుకున్నారు. బైడెన్ ఆహ్వానంపై వచ్చే నెలలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లుతున్న నేపథ్యంలోఈ ‘ హగ్ ’ బాగా క్లికయింది. జి 7 వేదిక మీద బైడెన్, మోడీ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. తరువాత తమ సీట్లకు వెళ్లారు.
హిరోషిమాలో ప్రధాని మోడీ పలువురు నేతలను కలిశారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భేటీ దశలో ప్రత్యేకించి సాంకేతిక పరిజ్ఞానంలో ద్వైపాక్షిక సహకారంపై ఆయనతో మాట్లాడారు. హరిత హైడ్రోజన్, హై టెక్నాలజీ, సెమికండక్టర్లు, డిజిటల్ ప్రజా సంబంధిత ఏర్పాట్లు వంటి వాటిపై ఇరువురు దృష్టి సారించారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరు పలు కీలక విషయాలపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
- Advertisement -