Monday, December 23, 2024

8 మంది ఎంపిలకు ఆశ్చర్యకరమైన అనుభవం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మందికి శుక్రవారం చాలా ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. అప్పుడు మధ్యాహ్న భోజన సమయం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలసి భోజనం కోసం వారికి ఆహ్వానం అందింది. వివిధ పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపిలు ఆవిధంగా పార్లమెంట్ క్యాంటీన్‌లో ప్రధానితో కలసి భోజనం చేయగలిగారు. బిజెపి ఎంపిలు హీనా గవిత్, ఎస్ ఫంగ్నోన్ కోన్యక్, జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టిడిపి ఎంపి రామమోహన్ నాయుడు, బిఎస్‌పి ఎంపి రీతేష్ పాండే, బిజెడి ఎంపి సస్మిత్ పాత్రా లంచ్ కోసం ప్రధాని మోడీతో చేరారు. తమను ప్రధాని కలవాలని అనుకుంటున్నారని మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపిలకు ఒక కాల్ వచ్చింది. ‘చలియే, ఆప్‌కో ఏక్ పనిష్‌మెంట్ దేనా హై (పదండి. మీకు నేను శిక్ష ఇవ్వవలసి ఉంటుంది)’ అని ప్రధాని వారితో అన్నారు. లిఫ్ట్ తలుపు తెరచుకున్నప్పుడు ఎంపిలు ఆశ్చర్యపోయారు. తమను క్యాంటీన్‌కు తీసుకువచ్చారని వారు గ్రహించారు. ‘మమ్మల్ని పిలిచారు.

మేము పైకి వెళ్లాం. మేము ఎక్కడికి వెళుతున్నదీ అప్పుడు గ్రహించాం& క్యాంటీన్ తలుపు తెరచుకున్నది’ అని ఒక ఎంపి ఒక ఆంగ్ల పత్రిక విలేకరితో చెప్పారు. ‘మేము క్యాంటీన్ చేరుకున్నప్పుడు సందర్శకుల లాంజ్‌లో ఉన్నాం. మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. మన అందరినీ ఎలా పిలిచారన్నది అర్థం కాలేదు’ అని ఆ ఎంపి చెప్పారు. ప్రధాని మోడీ ఎంపిలతో ఇష్టాగోష్ఠి సాగిస్తూ, తనకు అత్యంత ప్రీతిపాతమైని కిచిడీ అని తెలిపారు. ‘నేను ఎల్లప్పుడూ ప్రధాని తీరులో ఉండను. నాకు మంచి ఆహారం కావాలనే కోరుకుంటుంటాను’ అని ఆయన చెప్పారు. ఎంపిలు కూడా ప్రధాని మోడీ దగ్గర కూర్చుని ముచ్చటించే అరుదైన అవకాశం పాందారు. మోడీ తీరిక లేని కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, గుజరాత్ మొదలైన అంశాలపై ఆయనతో వారు మాట్లాడారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఇది ‘గొప్ప, అనుకోని అనుభవం’ అని ఎంపిలు చెప్పారు. ‘మేము అన్ని ప్రశ్నలు అడిగాం. మేము అజెండా సూచించాం’ అని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News