Monday, December 23, 2024

ప్రధాని మోడీవి పనికిమాలిన మాటలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

PM Modi should apologise to Telangana people: KTR

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అసహ్యంగా మాట్లాడారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మంగళవారం పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ”ప్రదాని మోడీవి పనికిమాలిన మాటలు. ఇలా మాట్లాడిన ప్రధాన మంత్రి మరొకరు లేరు. విశ్యవాసం కల్పించాల్సిన ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రైతుల పోరాటాలతో రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి. గుజరాత్ కంటే తెలంగాన అభివృద్ధి చెందుతుందని ప్రధానికి కడుపుమంట” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు.

PM Modi should apologise to Telangana people: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News