Wednesday, January 22, 2025

మోడీ బూటకపు వాగ్దానాలపై ప్రశ్నించాలి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

PM Modi should be questioned on fake promises: KTR

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడాన్ని ప్రశ్నిస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు. మోడీ చేసే వాగ్దానాలన్ని జూమ్లాలుగానే మిగిలిపోతాయని కెటిఆర్ మండిపడ్డారు. ఆయన బూటకపు వాగ్దానాలపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి 2022 నాటికి ఇల్లు అని మోడీ చేసిన వాగ్దానానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో జతపరుస్తూ.. క్యా హువా తెర వాదా అనే హాష్ ట్యాగ్‌తో కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News