Friday, December 20, 2024

అదానీ ఆస్తులను ప్రధాని మోడీ జాతీయం చేయాలి: సుబ్రమణియన్ స్వామి

- Advertisement -
- Advertisement -

చెన్నై: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక వెల్లడైన తర్వాత అదానీ కంపెనీల వాటాలు కుప్పకూలడం, దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు కోసం పట్టుబడడం వంటి పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూపు ఆస్తులను జాతీయం చేసి వాటిని అమ్మకానికి పెట్టాలని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నానని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి తెలిపారు.

పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ స్వామి మాట్లాడుతూ అదనీ గ్రూపునకు చెందిన ఆస్తులన్నిటినీ ప్రధాని మోడీ జాతీయం చేసి వాటిని అమ్మకం కోసం వేలం వేయాలని, ఆ వచ్చిన డబ్బును నష్టపోయిన వాటాదారులకు అందచేయాలని అన్నారు. కాంగ్రెస్‌లో కూడా చాలామందికి అదానీతో సంబంధాలు ఉన్నాయని..అయితే బిజెపి తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నదే తన కోరికని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏదో దాస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని, అందుకే ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News