Saturday, January 11, 2025

రూ. 88వేల కోట్లు మాయం చేసిన ప్రధాని మోడీ రాజీనామా చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్రంలో మోడీ సర్కార్ చరిత్రలో ఎవరు కనీ వినీ ఎరుగని అతిభారీ స్కాంకు పాల్పడిందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి శుక్రవారం నాడొక ప్రకటనలో ఆరోపించారు. ఏ రంగాన్ని వదలకుండా కాంగ్రెస్ స్కాములు చేస్తే.. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కొత్త కొత్త విధానాల్లో స్కాములు చేస్తోందని, కొత్తగా ముద్రించిన దాదాపు రూ. 88,032 కోట్ల విలువైన రూ. 500 నోట్లు మాయమయ్యాయని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ వేయడంతో ఈ ఘటన బయటపడిందన్నారు. కనిపించకుండా పోయిన 88 వేల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు కచ్చితంగా బిజెపి నాయకుల ఎలక్షన్ వార్ రూమ్ కి చేరాయని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలన్నారు. దీనికి బాధ్యతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలన దీనిపై ఇప్పటి వరకు స్పందించకుండా చర్యలు తీసుకోకుండా ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంతదాస్‌ని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ , ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీయూష్ గోయల్ పైనా చర్యలు తీసుకోవాలని సతీష్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే భారీగా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారని బీజేపీ పై ఆరోపణలు వచ్చాయని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు.. కొందరు బీజేపీ నాయకులకు చెందిన కొన్ని బ్యాంకుల్లో భారీగా బ్లాక్ మనీని మార్పిడి చేశారని ఆరోపణలు వచ్చాయన్నారు. ఇప్పుడు అంతకుమించిన మరో భారీ స్కామ్ బయటపడిందని అంటూ బీజేపీ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని సతీష్ రెడ్డి అన్నారు.

దేశంలోని 3 ఆర్బీఐ నోట్ల ముద్రణాలయాల్లో ప్రింట్ అయిన నోట్లు మాయం కావడం ఘోరం అని, తాము ముద్రించి పంపించేసామని సంస్థలు చెప్తున్నాయని అంటే 88 వేల కోట్ల రూపాయలు ఏమైపోయినట్టు? ఇవన్నీ ఎవరి జేబుల్లోకి చేరినట్టు? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం అంతా చూస్తే దీని వెనకాల బిజెపి భారీ కుట్ర ఉన్నట్టుగా కనిపిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల కోసం భారీగా కరెన్సీ నోట్లను.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దారి మళ్లించినట్టుగా స్పష్టమవుతోందన్నారు. నోట్లను దాచిపెట్టి వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి, రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడానికి వినియోగించాలని బిజెపి కుట్రలు చేస్తోందన్నారు. ఇంత భారీ మొత్తంలో కరెన్సీ నోట్లు మిస్సయినా ఇప్పటివరకు దీనిపై కేంద్రం సిబిఐ ఎంక్వైరీ కి కనీసం పోలీస్ ఎంక్వయిరీ కూడా ఆదేశించకపోవడాన్ని బట్టి దీని వెనకాల భారీ కుట్ర ఉందన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News