Monday, December 23, 2024

కాంగ్రెస్ సిఎంపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు

- Advertisement -
- Advertisement -

PM Modi showered praise on Congress CM

చత్తీస్‌గఢ్‌లో గోధన్ న్యాయ్ యోజన తీసుకొచ్చినందుకు…

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం లో ప్రధాని మోడీ చత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్‌ను ఆ రాష్ట్రంలో గోధన్ న్యాయ్ యోజన తీసుకొచ్చినందుకు ప్రశంసించారు. అంతేకాదు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఈ పథకం ద్వారా మహిళలు, స్వయం సహాయక సంఘాలు కిలో రెండు రూపాయల చొప్పున ఆవు పేడను సేకరిస్తున్నారు. గత నెల 28 నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. లీటర్ గోమూత్రానికి 4 రూపాయలు ఇస్తున్నారు. ఆవు పేడ, మూత్రం ద్వారా జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.

ఇలా తయారయ్యే ఈ జీవామృతంలో ఉండే సూక్ష్మ జీవులు నేలను సారవంతం చేస్తాయి. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతా లోకి చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నగదు పంపు తోంది. ఈ పథకం ద్వారా గోవుల సంరక్షణతోపాటు పంట పొలాలు సారవంతం కావడం రైతన్నలకు మేలు చేస్తోంది. అంతేకాదు ఆవు పేడ, గోమూత్రం సేకరించేవారికి నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతున్నాయి. సర్వత్రా ప్రశంసలు అందుకుంటోన్న గోధన్ న్యాయ్ యోజన పథకంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా దీనిపై ఫోకస్ చేశాయి. ఈ తరుణంలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ చత్తీస్‌గఢ్ సిఎం బాఘేల్‌ను ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News