Wednesday, January 22, 2025

కెసిఆర్ సర్కార్.. అత్యంత అవినీతి ప్రభుత్వం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: కెసిఆర్ ప్రభుత్వం.. అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని రూ.6,109కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చ్వుల్ గా ప్రధాని మోడీ ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. “కెసిఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోంది. వారి అవినీతి ఢిల్లీ వరకు పాకింది. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి.తొలిసారిగా అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం. ఇలాంటి అవినీతి చూసేందుకేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కెసిఆర్ సర్కార్ పని అయ్యింది. యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారు.తెలంగాణ వర్సిటీలలో మూడు వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కెసిఆర్ అవినీతి పాలనను తెలంగాణ చూసింది. ఇలాంటి పాలన వస్తుందని తెలంగాణ ప్రజలు అనుకోలేదు. ప్రజల నమ్మకాన్ని కెసిఆర్ సర్కార్ వమ్ముచేసింది” అని అన్నారు.

Also Read: తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి: కిషన్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News