Friday, December 27, 2024

శక్తి నాశనాన్ని కోరేవారు సర్వ నాశనమైపోతారు: మోడీ శాపాలు

- Advertisement -
- Advertisement -

సేలం: శక్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తానికి ఆపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులోని సేలంలో బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌తోపాటు దాని మిత్రపక్షమైన తమిళనాడులోని అధికార డిఎంకె హిందువులకు చెందిన శక్తిని నాశనం చేయాలని చూస్తున్నాయని, అయితే చివరకు ఆ పార్టీలే నాశనమవుతాయని మండిపడ్డారు. కాంగ్రెస్, డిఎంకె నాణానికి రెండు ముఖాలుగా ఆయన అభివర్ణించారు.

ఆ రెండు పార్టీలదీ అవినీతి, వారసత్వ రాజకీయాల చరితని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆదివారం ముంబైలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ శక్తిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రధాని దీటుగా స్పందిస్తూ తన దృష్టిలో ప్రతి తల్లి, కుమార్తె శక్తి రాపాలని, వారి భద్రత కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్హని ప్రకటించారు. కాగా ఆదివారం తాను శక్తిపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ సోమవారం వివరణ ఇచ్చారు. తాను మతపరమైన శక్తి గురించి మట్లాడలేదని, అధర్మం, అవినీతి, అస్యతాలకు చెందిన శక్తి గురించి మట్లాడానని ఆయన తెలిపారు.

కాగా..సేలం సభలో మోడీ ప్రసంగిస్తూ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఇతర పతాల గురించి ఎన్నడూ తప్పుగా మాట్లాడరని, కాని హిందూ మతాన్ని దూషించడానికి క్షణం కూడా ఆలస్యం చేయరని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం మొదలైందని, ఇండియా కూటమి ముంబైలో నిర్వహించిన తన మొదటి సభలోనే తన దురుద్దేశాలను బయటపెట్టుకుందని మోడీ విమర్శించారు. మనం శక్తి అని పిలుపుచుకున్న విశ్వాసాన్ని నాశనం చేస్తామని ఇండియా కూటమి ప్రకటించిందని, హిందూత్వంలో శక్తి అంటే ఏమిటో తమిళనాడులోని ప్రతి ఒక్కరికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో శక్తి అంటే కంచి కామాక్షి అమ్మవారు, మదుర మీనాక్షి అమ్మవార్లతోపాటు శక్తి పీఠం, సమయపురం మారియమ్మన్ వంటి స్త్రీ రూపంలో ఉన్న దేవతామూర్తులని అర్థమని ప్రధాని చెప్పారు. అంతేగాక హిందూ మతంలో శక్తి అంటే మాతృ శక్తి, నారీ శక్తి అని కూడా అర్థమని ఆయన వివరించారు.

జాతపీయ కవి సుబ్రమణ్య భారతిని గుర్తు చేస్తూ భారత మాతను శక్తి స్వరూపిణిగా ఆయన పూజించారని, దేశ నారీ శక్తిని కూడా ఆరాధించారని ప్రధాని తెలిపారు. తాను కూడా శక్తి ఉపసాకుడినని మోడీ చెప్పారు. ఇ శక్తిని నాశనం చేస్తామని కాంగ్రెస్, డిఎంకెకు చెందిన కూటమి అంటోందని ఆయన ఆరోపించారు. అంతేగాక ఇండియా కూటమి నాయకులు కావాలనే పదేపదే హిందూ మతాన్ని అవమానిస్తుంటారని, బాగా ఆలోచించే వారు ఆ పని చేస్తుంటారని ప్రధాని దుయ్యబట్టారు. ఇతర మతాలు వేటినీ వారు దూషించరని, కాని హిందూ మతాన్ని తిట్టడానికి క్షణం కూడా ఆలస్యం చేయరని ఆయన చెప్పారు. అందుకే తమిళనాడు సంస్కృతితో ముడిపడిన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించడాన్ని వారు వ్యతిరేకించారని, ఆయన ఆరోపించారు.

శక్తిని అంతం చేయాలనుకున్న వారు తామే నాశనమైపోయారని మన పురాణాలు చెబుతున్నాయని, తమిళనాడు ప్రజలు కూడా ఏప్రిల్ 19న శక్తి వ్యతిరేకులను అంతం చేయాలని పరోక్షంగారాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల తేదీని ప్రస్తావిస్తూ ప్రధాని పిలుపునిచవ్చారు. మాజీ ముఖ్యమంత్రి జె జయలిత బతికున్న రోజుల్లో ఆమె పట్ల డిఎంకె ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. డిఎంకె నిజస్వరూపం ఇదేనని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా డిఎంకె వ్యతిరేకించిందని ఆయన అన్నారు. ఈ కారణంగానే తమిళనాడులో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని ప్రధాని చెప్పారు. మహిళా వ్యతిరేకి అయిన డిఎంకెను ఎన్నికల్లో ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారం నుంచి దూరం కాగానే దేశంలో 5జి స్థాయి కమ్యూనికేషన్ వచ్చిందని ఆయన చెప్పారు. అయితే డిఎంకె దృష్టిలో 5జి నిర్వచనం తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన ఐదవ తరం పాలించడమేనని మోడీ విమర్శించారు. 2జి కుంభకోణానికి పాల్పడి డిఎంకె దేశానికి, తమిళనాడుకు అపఖ్యాతి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. మోడీ తన ప్రసంగంలో 10 సంవత్సరాల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బిజెపి కార్యకర్త ఆడివి వి రమేష్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. 2013లో హత్యకు గురైన పార్టీ కార్యకర్త రమేష్‌ను తలచుకుని భావోద్వేగంతో ఆయన గొంతు మూగబోయింది. కొద్ది సేపటికి తేరుకున్న ఆయన పార్టీకి రమేష్ అందచేసిన సేవలను గుర్తు చేశారు.

ఆడిటర్ రమేష్‌ను తాను మరవలేనని, దురదృష్టవశాత్తు రమేష్ మన మధ్యలో లేరని ఆయన చెప్పారు. పార్టీ కోసం రాత్రిపగలు కష్టపడ్డ రమేష్ మంచి వక్తని ఆయన తెలిపారు. హత్యకు గురైన రమేష్‌కు నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మోడీ తన ప్రసంగంలో తమిళ భాషను కూడా కీర్తించారు. కాగా..సభ ప్రారంభానికి ముందు ఓపెన్ రూఫ్ టాపు వాహనంలో సభా వేదిక వద్దకు వచ్చిన ప్రధానికి 11 శక్త అమ్మవార్లు ప్రత్యేక స్వాగతం పలికారు. ఎన్‌డిఎ కూటమి భాగస్వామ్య పక్షంలోని బహిష్కృత ఎఐఎడిఎంకె నాయకుడు ఓ పన్నీర్‌సెల్వన్, పిఎంకె వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్, ఎఎంఎంకె నాయకుడు టిటివి దినకరన్ తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News