అధికారంలో ఉన్నన్నాళ్లు ఒబిసి కమిషన్‌ను
పట్టించుకోని కాంగ్రెస్ మేము వచ్చాకే
కమిషన్‌కు చట్టబద్ధ హోదా ఆర్థికంగా
వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు మేమే
ఇచ్చాం రాజ్యసభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ కోసం పనిచేస్తోందని ప్రధాని నరేం ద్ర మోడీ గురువారం అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చల్లో పాల్గొన్న ఆయన ‘కాంగ్రెస్ రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని, కానీ బిజెపి జాతికి ప్రాధాన్యత ఇ స్తుంది’ అన్నారు. ‘ఐదారు దశాబ్దాల వరకు ప్రజలకు ప్రత్యామ్నాయ మోడల్ లేదు. 2014 తర్వాతే దేశం ఓ కొత్త మోడల్‌ను చూసింది. అది బుజ్జగింపు ఆధారమైనది కాక అందరికీ సంతృప్తిని కలిగించేది(సంతుష్టీకరణ్)’ అని వివరించారు. ‘ఎన్నికలప్పుడు తప్పుడు వాగ్దానాలు చేసి నమ్మిస్తారు, ప్రజలను మోసగించే రాజకీయాలతో నెట్టుకొస్తారు’ అన్నారు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకునే దానిపైనే బిజెపి ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. పథకాలన్ని నూటికి నూరు శాతం అమలు కావాలని,
ఎవరూ వంచనకు గురికాకూడదనేదే తమ విధానం అని మోడీ స్పష్టం చేశారు. ‘గత దశాబ్దంలో మేము ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ను అమలుచేసే ప్రయత్నం చేశాము. దాని ప్రభావాన్ని చూస్తున్నాము’ అని మోడీ తెలిపారు. కాంగ్రెస్ కులతత్వాన్ని వ్యాపించే ప్రయత్నం చేసిందన్నా రు. ‘కులం విషయాన్ని వ్యాపింపజేశారు. మూడు దశబ్దాలుగా అన్ని పార్టీల ఓబిసి నాయకులు ఓబిసి కమిషన్ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. కానీ అది తిరస్కరణకు గురయింది. నాడు వారి రాజకీయాలకు అది సరిపడి ఉండకపోవచ్చు. కానీ మేము ఓబిసి కమిషన్‌కు రాజకీయ హోదా కల్పించాము. తొలిసారిగా మేము ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్కలు కల్పించాము. దీనిని ఎ స్సీ, ఎస్టీ, ఓబిసికి చెందిన సమూహాలు స్వాగతించాయి. దీనివల్ల ఎవరికీ ఎలాంటి సమస్య లేదు’ అని మోడీ స్పష్టం చేశారు.