Wednesday, January 22, 2025

హెచ్‌పి కాంగ్రెస్ సర్కార్‌పై ప్రధాని విమర్శ

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానాన్ని కాంగ్రెస్ నెరవేర్చలేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆరోపించారు. రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ ‘తలబాజ్ సర్కార్’ తాళం వేసిందని ఆయన విమర్శించారు. బిజెపి సిమ్లా లోక్‌సభ స్థానం అభ్యర్థి సుభాష్ కశ్యప్‌కు మద్దతు సమీకరణ కోసం సిర్మౌర్ జిల్లా నహాన్‌లో ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, మతతత్వం, కులతత్వం, ఆనువంశిక రాజకీయాలు కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ఉమ్మడి సంస్కృతి అని అన్నారు. ‘నహాన్ లేదా సిర్మౌర్ నాకు కొత్త కాదు. కాని ఈనాటి వాతావరణం కొత్తగా ఉందని నేను చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే నహాన్‌లో ఇటువంటి చరిత్రాత్మక ర్యాలీని ఎన్నడూ నేను చూడలేదు. నా కోసం గాని, నా కుటుంబం కోసం గాని కాకుండా అభివృద్ధి చెందిన దేశం కోసం బిజెపి మూడవ హయాం కోసం మీ ఆశీస్సులు కోరడానికి ఇక్కడికి వచ్చాను’ అని సభికులను ఉద్దేశించి మోడీ చెప్పారు.

సరిహద్దు పొడుగునా నివసిస్తున్న హిమాచల్ ప్రజలకు బలమైన దేశం విలువ తెలుసు అని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్‌పిఎస్‌ఎస్‌సి) రద్దుపై కాంగ్రెస్‌ను మోడీ తూర్పారపడుతూ, యువతకు లక్ష ఉద్యోగాలు ఇవ్వడం మాట అటు ఉంచి కాంగ్రెస్ ‘తలబాజ్ సర్కార్’ నియామక కమిషన్‌కు తాళం వేసింది ఆక్షేపించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో హెచ్‌పిఎస్‌ఎస్‌సిని రద్దు చేసింది. పేపర్ లీకైన విషయాన్ని 2011 డిసెంబర్‌లో కనుగొన్న అనంతరం కమిషన్ నిర్వహణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి)ల రిజర్వేషన్‌ను కాంగ్రెస్ లాక్కుని ముస్లింలకు ఇచ్చిందని కూడా మోడీ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News