Monday, December 23, 2024

కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తాం: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ”అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా?. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?. అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకోవాలా? వద్దా?.

తెలంగాణలో కుటుంట పాలన, అవినీతి పెరిగాయి. తండ్రి, కొడుకు, కుమర్తె.. అంతా అధికారంలో ఉంటారు. కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది. కుటుంబ పాలనతో అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తాం” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News