Tuesday, November 5, 2024

అభివృద్ధికి అడ్డుగోడలు కడుతున్నారు: విపక్షాలపై ప్రధాని ధ్వజం

- Advertisement -
- Advertisement -

లక్నో: పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సమయంలో ఢిల్లీలో కొంతమంది పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే వారి స్వార్థపూరిత రాజకీయాలతో దేశ పురోగతిని అడ్డకోలేరని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం లబ్ధిదారులతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆగస్టు 5ను దేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. ఇదే రోజున రెండేళ్ల క్రితం జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 అధికరణం రద్దు, గత ఏడాది అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. మరో వైపు టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ పురుషుల జట్టు కాంస్య పతకాన్ని సాధించి 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రోజు కూడా ఇదే కావడాన్ని మోడీ విశేషంగా చెప్పుకొచ్చారు.

‘ఓ వైపు దేశం కోసం క్రీడాకారులు గోల్ మీద గోల్ చేస్తుంటే మరికొందరు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం ‘సెల్ఫ్ గోల్స్’ చేసుకుంటున్నారని పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకొంటున్న విపక్షాలనుద్దేశించి ప్రధాని అన్నారు. అభివృద్ధికి గోడలు కట్టాలన్నదే విపక్షాల అభిమతమని, అయితే 130 కోట్ల మంది ప్రజలు వారి ప్రయత్నాలను సాగనివ్వరని ఆయన అన్నారు. భారత్ వేగంగా ముందుకు నడుస్తోందని ఆయన అంటూ వివిధ రంగాల్లో దేశం సాధించిన విజయాలను ఏకరువుపెట్టారు. గత నెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ పెగాసస్ వ్యవహారం, రైతు సమస్యలు, పెరుగుతున్న ధరలు వంటి పలు సమస్యలపై ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తుప్న విషయం తెలిసిందే. విపక్షాల గొడవ కారణంగా ఉభయ సభలు ప్రతిరోజూ వాయిదా పడుతూ వస్తున్నాయి కూడా.

PM Modi slams Opposition concerns in Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News