Wednesday, February 5, 2025

మీవి ఖాళీ నినాదాలు.. మావి అభివృద్ధి విధానాలు

- Advertisement -
- Advertisement -

అప్పుడు పావలా మాత్రమే ప్రజలకు చేరితే.. ఇప్పుడు
రూపాయి అందుతోంది గుడిసెల్లో ఫోటోలు
దిగుతూనే..వాళ్లపై చర్చను బోరింగ్ అంటారా?
అద్దాల మేడలు,స్టైలిష్ షవర్లపై మీరు దృష్టిపెడితే
మేం పేదలకు నల్లా నీళ్లు ఇవ్వడంపై నజర్ పెట్టాం
అది ‘ఆప్’ కాదు..యువత పాలిట ఆపద
విపక్షాలపై ప్రధాని మోడీ విసుర్లు.. పార్లమెంట్‌లో
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై
చర్చకు సమాధానం రూ.12లక్షల వరకు వేతన
జీవులకు పన్ను ఊరట కల్పించామని వ్యాఖ్య

జాకుజీపై దృష్టి, ఝగ్గీల వద్ద ఫోటోలు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విసుర్లు రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో చర్చకు సమాధానం గత ప్రభుత్వాలపై విమర్శలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఊహించినట్లుగానే మంగళవారం ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రా లు సంధించారు.

ముందుగా ఆయన బుధవారం నాటి ఢిల్లీ ఎన్నికల్లో తన ప్రత్యక్ష ప్రత్యర్థి ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. క్రితం వారం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై లోక్‌సభలో మంగళవారం నాడు చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. ‘కొందరు రాజకీయ నేతలు దృష్టి జాకుజీలపై. స్టైలిష్ షవర్లపై ఉంటుంద’ని అంటూ మోడీ తన విమర్శలు ప్రారంభించారు. ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ‘అద్దాల మేడ’గా అభివర్ణిస్తున్న బంగళా కోసం విలాసవంతమైన సాధనాలు, ఫర్నిషింగ్‌లపై రూ.45 కోట్ల మేరకు పన్నుచెల్లింపుదారుల డబ్బు వెచ్చించినట్లు వచ్చిన ఆరోపణలు, కేజ్రీవాల్‌ను అన్యాపదేశంగా మోడీ తన సమాధానంలో ప్రస్తావించారు. ‘కొందరు నేతల దృ ష్టి అంతా జాకుజీలు, స్టైలిష్ షవర్లపైనే ఉంటుంది. కానీ మా దృష్టి అంతా ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్లు ఇవ్వడంపైనే, మా ప్రభుత్వం

12 కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసింది’ అని మోడీ ప్రకటించా రు. హర్యానాలో తమ పార్టీ ట్రాక్ రికార్డును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. నిరుడు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజెపి సాధించిన అఖండ విజయాలను మోడీ శ్లాఘించారు.
కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ ఆ తరువాత తన దృ ష్టిని కాంగ్రెస్‌పైకి మళ్లించారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం చర్చలో పాల్గొం టూ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించిన విషయం విదితమే. భారత్ చైనా సరిహద్దు వివాదం, కుంటుతున్న త యారీ రంగం గురించి ప్రభుత్వాన్ని ఆయన లక్షం చేసుకున్నారు. తమ ‘గరీబీ హఠావో’ వాగ్దానాలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మేము నిరుపేదలకు నినాదాలు ఇవ్వలేదు… మేము అసలైన అభివృద్ధి ఇచ్చాం.

ఇప్పటి వరకు మేము నిరుపేదలకు నాలుగు కోట్ల ఇళ్లు ఇచ్చాం’ అని ప్రధాని చెప్పారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో దాని గురించి విస్తృతంగా మాట్లాడారు. కానీ, గుడిసెలో ‘ఫోటోల తంతు’ చూసేవా రు& నిరుపేదలపై చర్చను బోరింగ్‌గా భావిస్తుంటారు’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలోని నిరుపేదల నివాస ప్రాంతాల్లో ప్రచారం సమయంలో ఆప్, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతల తీరును మోడీ ఆ విధంగా ఎండగట్టారు. ప్రధాని మోడీ అంతటితో ఊరుకోలేదు. తనకు ముందు ప్రధానులుగా ఉన్నవారిలో ఒకరైన దివంగత కాంగ్రెస్ పిఎం రాజీవ్ గాంధీపై కూడా విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News