Friday, November 22, 2024

అవినీతిపై పోరాడుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రతిపక్షాలకు చురకలంటించారు. ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అవినీతిపై పోరాడుతుంటే కొందరికి(ప్రతిపక్షాలకు) కోపం వస్తోందన్నారు. అందుకే వారు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాన్నారు.కొన్ని పార్టీలయితే అవినీతిని రక్షించాలంటూ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాయంటూ పరోక్షంగా విపక్షాలపై విమర్శలు చేశారు. న్యూఢిల్లీలో మంగళవారం బిజెపి కేంద్ర కార్యాలయం కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థలున్నాయని, బిజెపిని ఎదుర్కోలేక రాజ్యాంగ సంస్థలపై విమర్శలు చేస్తున్నారన్నారు.

ఒకప్పుడు రెండు లోక్‌సభ సీట్లున్న బిజెపి ఇప్పుడు 303 ఎంపి స్థానాలను దక్కించుకుందని ప్రధాని అన్నారు. తూర్పునుంచి పశ్చిమం వరకు ఉత్తరంనుంచి దక్షిణం వరకు బిజెపి వస్తరించిందన్నారు. బిజెపి టీవీలు, చానళ్లు, పేపర్లు, ట్విట్టరు, యూట్యూబ్ ద్వారా పుట్టుకొచ్చిన పార్టీ కాదని, కార్యకర్తల కృషి వల్లే అభివృద్ధి చెందిందన్నారు. అందుకే బిజెపి ప్రంచంలోనే అతిపెద్ద పార్టీగానే కాకుండా భావి తరాలకు చెందిన పార్టీగా ఎదిగిందన్నారు. భారత దేశాన్నిఆధునికమైనదిగా, అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడమే పార్టీ లక్షమని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News